
* ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
* ఎండి ముజఫర్ హుసేన్
ఆకేరు న్యూస్ తాడ్వాయి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణాల పై ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎండి ముజఫర్ హుసేన్ సూచించారు. ఆదివారం తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఎండీ ముజఫర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జి బడే నాగ జ్యోతి ఇందిరమ్మ ఇండ్ల లో అవినీతి , అనర్హులకు మంజూరు అయ్యాయని అసత్య ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి సీతక్క గడిచిన 16 నెలలోనే కాటాపూర్ గ్రామానికి 30 ఇళ్ళను నిరుపేదలకు మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు , ఆదివాసి, గిరిజన ప్రాంతాలకు ప్రాదాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ . పేద వాడికి ఇళ్లు వచ్చేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చి యంతో ఉన్నది అనిఅన్నారు. బి ఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం పెదోళ్ళకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు పాలకుర్తి మధు , సీనియర్ నాయకులు పులి చిన్న నర్సయ్య, పల్నాటి సత్యం, లంజపల్లి నర్సయ్య , మర్రి లక్ష్మయ్య , మద్దూరి రాములు, పులి రవి, సజ్బు, మద్దురి రాజు , యువజన కాంగ్రెస్ నాయకులు శనిగరపు చిరంజీవి , గుండారపు సంతోష్ , పుల్లురి చిరంజీవి, సత్యం , మజ్జు , ఆదినారాయణ, శరత్, పుల్లూరి నాగార్జున్ , నాగరాజు , పల్నాటి నరేష్, రాజు తదితర నాయకులు కార్తకర్తలు పాల్గొన్నారు.
………………………………………………………