
* జూన్ నుంచి అమలు
* కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా
ఆకేరున్యూస్, ఢల్లీి: ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ ఈ ఏడాది మే లేదా జూన్ నెలాఖరు నుంచి యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. మన బ్యాంకు ఖాతాలో నుంచి తీసుకున్న మాదిరిగానే పీఎఫ్ ఖాతా నుంచి కూడా నేరుగా డబ్బులు ఏటీఎం కేంద్రాలతో పాటు గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. లక్ష రూపాయల వరకు వెంటనే విత్‌డ్రా లేదా తాము కోరుకున్న బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చని సుమితా దవ్రా వివరించారు.
…………………………..