ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టుల ఈ కేసు విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్ తరపు న్యాయవాది లేకపోవడంతో.. జస్టీస్ బీవీ నాగరత్న కేసు విచారణను వాయిదా వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణాలో ఫోన్ ట్యాపరింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
………………………………………………….
