* కీలక ఉన్నతాధికారుల వాంగ్మూలాలు నమోదు
* ప్రభాకర్‌రావు తెలిపిన సమాధానాల మేరకు విచారణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి సిట్ విచారించింది. వారికి నోటీసులు ఇచ్చి సిట్ విచారణ చేపట్టింది. గత ప్రభుత్వంలో పని చేసిన ఇద్దరు సీఎస్ల వాంగ్మూలాలను కూడా రికార్డు చేశారు. మాజీ జీఏడీ సెక్రటరీ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను సిట్ అధికారులు విచారించారు. అప్పటి న్యాయశాఖ కార్యదర్శిని కూడా విచారించినట్లు తెలిసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ వద్దకు వెళ్లి వాంగ్మూలం రికార్డు చేశారు. ఉన్నతాధికారులు చెబితేనే తాను చేశానని ప్రభాకర్ రావు తెలపడంతో పోలీసులు ఈమేరకు విచారణ చేపడుతున్నారు. అదే విషయంపై నవీన్ చంద్ ఎదుట ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో అనుబంధ చార్జ్ షీట్ నమోదు చేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈనెల 25తో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. దీంతో ఆలోపే కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
………………………………………………

