ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తాజాగా సిట్ మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) సోదరుడు కొండల్ రెడ్డి(Kondal reddy)కి సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రేపు ఉదయం సిట్ కార్యాలయానికి రావాలని ఈమేరకు నోటీసులు జారీ చేసింది. విపక్షనేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు సిట్ కార్యాలయానికి రావాలని ఆయనకు అధికారులు నోటీసులు పంపారు. ఈమేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. వారిలో జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madavaram Krishnarao) కుమారుడు సందీప్ రావు కు కూడా నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు రావాలని సూచించారు. అయితే.. కొండల్ రావు, సందీప్ రావులు విచారణకు హాజరు కాలేదు. అనారోగ్యం వల్ల సిట్ కార్యాలయానికి రాలేకపోయినట్లు కొండల్ రావు తెలిపారు. ఇంట్లో విచారణకు సిద్ధమని అధికారులకు విన్నవించారు.
…………………………………………….
