
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః బంగ్లాదేశ్లో విమానప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ రాజధానిలో ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలింది. బయలుదేరిన కొద్ది సేపటికే విమానం ఢాకాలోని ఓ పాఠశాల భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలెట్ తో పాటు పలువురు మృతి చెందారు. పాఠశాల భవనంపై పడడంతో పాఠశాల విద్యార్థులు మృతిచెందినట్లు సమాచారం . ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంత మంది చనిపోయారనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………….