* నెత్తిన పిడుగులా పడిన విమానం
* 20 మంది మెడికోల మృతి
*కాలేజీ క్యాంటీన్ లో భోజనం చేస్తున్న యువ డాక్టర్లు
* టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఘటన
* విమానంలో విజయ్ రూపానీ లేరా..?
ఆకేరు న్యూస్ డెస్క్ : నెత్తిన పిడుగు పడ్డట్లుగా ఉన్నట్లుండి నెత్తిన విమానం పడడంతో 20 మంది మెడికోలు చనిపోయారు. అహ్మదాబాద్ నుండి లండన్ కు 230 మంది ప్రయాణికుల తో బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్ద నిమిషాలకు కుప్పకూలింది.. కూలిన ప్రాంతంలో విధ్వసం జరిగింది . అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజి పడడంతో కాలేజీ క్యాంటీన్ లో భోజనం చేస్తు 20 మంది యువ డాక్టర్లు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.. నెత్తి మీద పిడుగు పడ్డట్లుగా విమానం బిల్డింగ్ లపై కుప్పకూలడంతో కింద భవనాల్లో ఉన్న వారుకూడా మృతి చెందారు. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కాని ఇంకా అధికారులు ఈ విషయాన్ని దృవీకరించలేదు. విజయ్ రూపానీ వేరే విమానంలో ప్రయాణించినట్లుగా వార్తులు వస్తున్నాయి. విమానంలో మొత్తం 169 మంది భారతీయులు ఉన్నారు. అందులో 12మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది చిన్నారుల్లో ఇద్దరు శిశువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో యుద్ధవాతావరణం కన్పిస్తోంది..విమాన ప్రయాణికులతో పాటు కిందున్న వారు ఎంతమంది చనిపోయారనేది తెలియరాలేదు మొత్తం మీద భారీగా ప్రాణ నష్టం జరిగింది.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంత్రిని వెలిబుచ్చారు. ఘటనాస్థలి ని పరిశీలించడాని ప్రధాని బయలు దేరినట్లు తెలిసింది.చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
………………………………………………..
