* కేంద్రం పెండింగ్ బిల్లులపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కీలక భేటీ ప్రజా భవన్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు, పలు అంశాలపై ఈ చర్చ కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, సీఎంఆర్ నిధులు, మహిళా, శిశు సంక్షేమ పథకం, ఇరిగేషన్, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి చర్చించనున్నారు.
……………………………………………………
