
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* బాన్సువాడ నేతలతో సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా మిగిలారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ ఎస్ నేతలతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కార్యకర్తలకు సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వదిలిన పోచారం వెంట ఎవరూ లేరని పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఒంటరిగా మిగిలారని అన్నారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన పార్టీ బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా గత 20 నెలలుగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం బాన్స్వాడలో విజయవంతంగా కొనసాగుతున్నదని, గ్రామగ్రామాన గులాబీ పార్టీతో నిలబడిన కార్యకర్తల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు బాన్స్వాడ నుంచి వచ్చిన కామారెడ్డి జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జుబేర్, నాయిని పద్మ మరియు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
……………………………………