* నిందితుడి కోసం లడఖ్‌కు ప్రత్యేక పోలీసుల బృందాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johny Master)పై పోక్సో కేసు నమోదైంది. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని సహ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు విచారణ అనంతరం నార్సింగ్ పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో, అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు లడక్ కు బయలుదేరాయి. కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై(Chennai), ముంబై(Mubai), హైదరాబాద్(Hyderabad)తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు నార్సింగి(Narsing)కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
……………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
