
* ఆలస్యంగా వెలుగులోకి..
ఆకేరున్యూస్,హైదరాబాద్: సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ప్రముఖ రియాలిటీ షో ‘ఢీ’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఆయన అన్న నివాసంలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో షాకింగ్ నిజాలు తెలిశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణ మాస్టర్‌పై గతనెల బాలిక కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
……………………………………