
* కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందా?
* బీసీ రిజర్వేషన్లపై సూటి ప్రశ్న
* బీజేపీపై నెపం వేసి తప్పుకోవద్దని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీల రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి (CONGRESS GOVERNMENT)స్త్రభౄఙజ్ఞళఛౄజ్ఞఞ) అసలు చిత్తశుద్ధి ఉందా అని బీఆర్ ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC KAVITHA)ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల (BC RESERVATIONS)సాధనకు ఆమె దీక్ష ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఆమె ధర్నా మొదలైంది. బీసీలకు కల్పిస్తామన్న రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారా లేదా అని క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సమాజంలో సగానికి పైగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్లు అవసరమని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతోనే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ధర్నా చౌక్‌లో బీఆర్ అంబేడ్కర్, (BR ABEDKAR) జ్యోతిరావు ఫులే,(JYOTHIRAO POOLE) ప్రొఫెసర్ జయశంకర్ (PROFFESSOR JAYASHANKAR)విగ్రహాలకు నివాళులర్పించిన కవిత, ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలని, ఆర్థిక అవకాశాలు పెరగాలని తమ సంకల్పం అని ఆమె వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. భాజపాపై నెపం వేసి సమస్య నుంచి తప్పించుకోవద్దని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌పై వేరు బిల్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేకంగా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
………………………………………..