
* ఆదిలాబాద్‌లోని స్కూల్లో దారుణం ఘటనను ఛేదించిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాఠశాల వంట గదిలో పురుగుల మందు కలిపిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ధర్మపురికి చెందిన కిష్టుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తానే విష ప్రయాగం చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇంట్లో వారిపై కోపంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ధర్మపురి పాఠశాల(Dharmapuri School) స్కూలు విద్యార్థులు తాగే నీళ్లలోనూ. మధ్యాహ్నం భోజనం వండే సామగ్రిపైనా విషప్రయోగం (Mixed Poison) జరిగిన ఘటన తెలిసిందే. పాఠశాల హెడ్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
…………………………………………