* మానసిక రోగిగా గుర్తింపు
ఆకేరున్యూస్: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ను అతని నివాసంలోనే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు అతని వాహనాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు గుజరాత్లోని వడోదర జిల్లాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అతడు ఓ మానసిక రోగి అని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా అతను 2014 నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అతని ఆసుపత్రి పత్రాలను కూడా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడిరచారు.
………………………………….
