
ఆకేరున్యూస్, జగత్యాల: జగిత్యాల (JAGITYAL) జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజవాణి (PRAJAVANI) కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగుడిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజ గంగారాం తన సమస్యలను ప్రజావాణిలో చెప్పుకుందామని వస్తే కలెక్టర్ ను కలువనీయకుండా అతడిని బయటకి ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు.పోలీసులు సిబ్బంది ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నా కలెక్టర్ సత్యప్రసాద్ (SATYAPRASAD) ఈ దృశ్యాన్ని చూసి కూడా పోలీసులను వారించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్రంగా స్పందించారు ఎక్స్ వేదికగా ఆమె పోలీస్ సిబ్బంది ఓ దివ్యాంగుడి వీల్ చైర్ కిందపడేసి ఈడ్చుకుంటూ తీసెకెళ్లడాన్ని ఖండించారు. చూసీ చూడనట్లుగా కలెక్టర్ వ్యవహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు.
………………………………………..