ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఇటీవలే హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్.. తాజాగా రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను పనిచేయకుండా చేశారు. దీంతో గద పది రోజులుగా రెండు కమిషనరేట్ల వెబ్సైట్లు పూర్తిగా నిలిచిపోయాయి. వీటిలోకి మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెబ్సైట్లను క్లిక్ చేస్తే అధికారిక సమాచారానికి బదులుగా గేమింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో సర్వర్లను డౌన్ చేసి వాటిని నిర్వహిస్తున్న ఎన్ఐసీకి సమాచారం అందించారు. సమస్యను పరిష్కరించేందుకు రెండు కమిషనరేట్లలోని ఐటీ బృందాలు యత్నిస్తున్నాయి. వెబ్సైట్ల పునరుద్ధరణకు ఎన్ఐసీ పర్యవేక్షణలో ప్రతినిధులు పనిచేస్తున్నారు. రెండు కమిషనరేట్ల పోలీస్ సాప్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. మళ్లీ హ్యాకింగ్ కాకుండా అధునాతన ్గªర్వాల్స్ ఆడిట్ చేస్తున్నారు. ఆడిహ్యాకింగ్‌కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ కైమ్ర్ పోలీసులతో సమన్వయం చేస్తూ సర్వర్ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమ య్యారు. కాగా, ఇదే తరహాలో పలు ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు కూడా హ్యాక్ అయినట్లు సమాచారం. ఇప్పటికే డార్క్ వెబ్‌లో 22 వెబ్సైట్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉందని సైబర్ నిపులు చెబుతున్నారు.
………………………………………….
