* పోలీసుల త్యాగాలు మరువలేనివి
* అమరులైన పోలీస్ కుటుంబాలకు ఉచితంగా స్థలం
* మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
*పోలీస్ అమరులకు సీఎం రేవంత్ రెడ్డి వివాళి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : పోలీసులు అంటేనే ప్రజలకు ఓ నమ్మకం భరోసా అని
పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పోలీస్ అమరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు . గోషామహల్ లో నూతనంగా నిర్మించిన పోలీసు అమరుల స్మారక స్తూపాన్ని సీఎం ఆవిష్కరించారు. పోలీసులు సమాజం కోసం చేస్తున్న త్యాగాలు మరువలేనివి అని సీఎం అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని ఆ కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలం కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఈ నెల 17 నేరస్థుడి చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆధుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్, డీజీలు, ఐజీలు, కమిషనర్లు, మాజీ డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ సేవలపై సీఎం మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీ శివధర్ రెడ్డికి అందజేశారు.
………………………………………….
