
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : 2022 నోటిఫికేషన్ ప్రకారం పోలీస్ ఉద్యోగాల్లో చేరిన కొంతమంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగాల్లో చేరినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేయడానికి స్థానికత చూపించడానికి నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లను సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన 59 మంది అభ్యర్థుల్లో 54 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని తెలిపారు. అయితే ప్రస్తుతం శిక్షణా కాలంలో ఉన్న అభ్యర్థులకు శిక్షణ నిలిపివేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖలో నే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారంటే ఇతర శాఖల పరిస్థితి ఏంటనే అనుమానాలు వస్తున్నాయి. ఇంకెంత మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారనే దాని మీద ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక ముందు ఇలాంటి సంఘటలు పునరావృతం కాకుండా చూస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
…………………………………….