* పలు కీలకాంశలు వెలుగులోకి..
* రెండు గంటల పాటు విచారణ.. స్టేట్మెంట్ రికార్డు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సిట్ దూకుడు పెంచింది. ఇన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న అధికారులు విచారణ ప్రారంభించింది. మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పట్లో ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి నోటీసులిచ్చారు. దీంతో గురువారం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. రెండు గంటల పాటు ఆయన్ను పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధ కిషన్ రావు స్టేట్మెంట్లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము ఈ పని చేశామని రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ఓఏస్డీకి నోటీసులు ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసు ఏ దశలో ఉందో తెలుసుకున్నారు. ఈనేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పడు ఓఎస్డీగా విధుల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 4013
మంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది.
……………………………………….
