
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : గద్వాల పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహాకులతో పాటు విటులను, వేరే రాష్ట్రాలకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఒడిస్సాకు చెందిన యువతితో పాటు నిర్వాహకులు గద్వాల పట్టణానికి చెందిన ఒక యువకుడు గద్వాల మండలం పాలవాయి గ్రామానికి చెందిన మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.
……………………………………..