
* ఇన్స్టా పరిచయంతో యువకులతో పాటు వచ్చిన బాలికలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ నెల 19న మచ్చబొల్లారంలో అదృశ్యమైన ఇద్దరు బాలికలను నాలుగు రోజుల అనంతరం పోలీసులు కాపాడారు. ఇన్స్ట్రాగ్రామ్(Instagram)లో పరిచయమైన ఇద్దరు యువకులు.. వారికి మాయమాటలు చెప్పి హోటల్ గదికి రప్పించారు. ఆ యువకుల నుంచి తప్పించుకుని బాలికలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్ లో ఉన్న బాలికలను కాపాడిన పోలీసులు నిందితులైన సాత్విక్, మోహన్ అరెస్ట్ చేశారు.
………………………………………..