*23 లక్షల విలువ చేసే..
*46 కిలోల గంజాయి పట్టివేత
*ఇద్దరు అరెస్ట్, రిమాండ్
* వివరాలు వెల్లడించిన ట్రైనీ ఐపీఎస్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రూ.23 లక్షల 20వేల విలువచేసే 46 కిలోల 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించినట్లు ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర తెలిపారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం ఎస్సై పిట్ట రాజేష్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ లో ఒక మగ, ఒక ఆడ ఇద్దరు 5 బ్యాగులు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూన్నారు. పోలీసుల రాకను గమనించి అక్కడి నుండి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని బ్యాగులు తనిఖీ చేయగా వారివద్ద 46.85 కిలోల గంజాయి లభించింది. వారిని విచారించగా తమ పేర్లను సత్య రంజన్ బారెల్, దీప్తి మాయి స్వైన్ గా పేర్లు తెలిపినట్టు ఆమె తెలిపారు.
ఈ గంజాయి భువనేశ్వర్, ఒడిశా రాష్ట్రాల నుండి ముంబయిలోని దాదర్ కి అక్రమంగా తరలించి అక్కడ అమ్మి ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించిలని ఉద్దేశ్యం తో తరలిస్తుండగా మా సిబ్బంది పట్టుకున్నట్లు ట్రైనీ మనిషా నెహ్ర తెలిపారు. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం లోని పలు సెక్షన్లల కింద కేసు ను నమోదు చేసి వారి వద్ద నుండి 46.4 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను, రూ. 2690లను, ట్రైన్ టికెట్ ను సీజ్ చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
