
* మెషిన్ నుంచి వస్తూనే ఉన్న లిస్టు
* ద్విచక్రవాహనంపై 233 పెండింగ్ చలాన్లు.. విలువ రూ 45,350
* బండి తాళం పోలీసుల చేతిలో పెట్టి.. వెళ్లిపోయిన వానదారుడు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commisionarate) పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు.. ఓ వాహనానికి ఉన్న పెండింగ్ చలాన్ల లిస్టు చూసి నిర్ఘాంతపోయారు. మెషిన్ నుంచి చలాన్ల లిస్టు వస్తూనే ఉంటే ఆశ్చర్యపోయారు. 10, 20 కాదు.. ఏకంగా 230 చలాన్లు పెండింగ్ ఉన్నాయి. కనీసం పదివేల రూపాయల విలువ చేయని ఆ బండిపై.. సుమారు అర లక్ష వరకు పెండింగ్ చలాన్స్ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు బిత్తరపోయారు.. ఆ చలాన్స్ కట్టాలని పట్టుబట్టడంతో వాహనదారుడు పోలీసుల చేతిలో తాళాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఖాజీపేట ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ(Hanmakonda)కు చెందిన అస్లాంకు చెందిన వాహనంపై 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉనట్లు గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ 45,350గా నిర్ధారించారు. దాదాపు ఎనిమిది ఏళ్ల నుంచి ఈ చలాన్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ చలాన్స్ల వివరాలు చూసిన వెంటనే వాహనదారుడికి వాటిని క్లియర్ చేయాలని సూచించారు. అంత మొత్తం కట్టలేని పోలీసులకు బండి ఇచ్చి వెళ్లిపోయాడు.
………………………………………