* సీఎం రేవత్ రెడ్డి పై పుస్తకం రాసిన నెక్కొండ వాసి
* పుస్తకానికి గుర్తింపు నిచ్చిన ప్రచురణ సంస్థలు
* త్వరలో పుస్తకావిష్కరణ
ఆకేరు న్యూస్ హనుమకొండ : సీఎం రేవంత్ రెడ్డి పై తనకు ఉన్న అభిమానాన్ని పుస్తకరూపంలో చూపించాడు ఓ యువకుడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన బూకియా మోహన్ సీఎం రేవంత్ రెడ్డిపై రాజకీయంగా మొనగాడు అనే పుస్తకాన్ని రాసి సీఎం పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ పుస్తకం ప్రముఖ ప్రచురణ సంస్థల గుర్తింపు పొందింది. త్వరలో పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మోహన్ తెలిపారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేసిన మోహన్ కు పాటలు రాయడం అలవాటు. గతంలో మోహన్ రాసిన పాటలు యూ ట్యూబ్ చానళ్లలో పాపులర్ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో సీఎం వివరాలు ఒక్కొటొక్కటిగా సేకరించి పుస్తకాన్ని పూర్తి చేసినట్లు మోహన్ తెలిపారు. పోలియో సోకడం వల్ల ఓ కాలు బలహీనంగా ఉన్నా పట్టుదలతో తన కు ఉన్న రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నాడు. భవిష్యత్ లో మరిన్ని పుస్తకాలు రాస్తానని మోహన్ తెలిపారు. చిన్నప్పుడే తండ్రి మోహన్ తల్లికి విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకోవడంతో మోహన్ తల్లి ములుగు నుంచి తన సోదరుడి ఇళ్లు నెక్కొండ మండలం అలంకానిపేటకు చేరింది. మోహన్ విద్యాభ్యాసం మేనమామ సంరక్షణలో జరిగింది. తన పీజీలో ఉండగానే మేనమామ కన్నుమూశాడని ప్రస్తుతం తాను ఒంటరిగా బతుకుతున్నానని మోహన్ తెలిపారు. వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల రూపాయలతో ప్రస్తుతం జీవిస్తున్నానని భవిష్యత్ లో కాలేజి లెక్చరర్ కావాలనే కోరిక ఉందని తెలిపారు.
…………………………………………..
