
* రాజ్‌గోపాల్ రెడ్డి కామెంట్స్
ఆకేరు న్యూస్, డెస్క్ : రాజకీయాలంటే పదవులు కాదని రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. ట్వట్టర్ వేదికగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. కొత్తగా ఎన్నికయిన మంత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాసేవలో వారు మరింత విజయం సాధించాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు.గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇతర ప్రసార సాధనాల్లో రాజగోపాల్ రెడ్డిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మంత్రి పదవి ఇవ్వనందుకు రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ఈ మేరకు ఇతర అసంతృప్తి నేతలతో మంతనాలు జరిపారనే వార్తలు వచ్చాయి అసలు సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీనుంచి బయటకు పంపేందుకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారనే వార్తలు వచ్చామయి.తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
……………………………………………..