* రాష్ట్రాభివృద్ది కోసం ప్రధానిని కలుస్తూనే ఉంటా
* కెసిఆర్ తన 40 ఏళ్ల అనుభవాన్ని అభివృద్దికి కేటాయించాలి
* నిమ్జ్ భూ బాధితులకు న్యాయం చేస్తాం
* జహీరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, సంగారెడ్డి: ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. తర్వాత అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఎన్నిసార్లయినా ప్రధాని మోదీని కలుస్తామని.. తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకొస్తామని వెల్లడిరచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం జహీరాబాద్ హుగ్గెళ్లిలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆపై కేంద్రీయ విద్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామని.. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని… నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లా పేరు చెబితేనే ఇందిరమ్మ గుర్తొస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్ ప్రజలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ గుర్తుపెట్టు కుంటుందన్నారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ర్గా జహీరాబాద్ కావాలని కృషి చేశామని తెలిపారు. జహీరాబాద్‌కు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సవిూక్ష చేస్తామన్నారు. భవిష్యత్‌లోనూ మెదక్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. సింగూరు ప్రాజెక్ట్‌ను ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతామన్నారు. సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులను అప్పులబాధ నుంచి తప్పించామని.. రైతు భరోసా పథకం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరే అన్నారని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాలు బాగుపడతాయని తెలిపారు. ఐదేళ్లలోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. విూరు అండగా ఉండండి… ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని సిఎం రేవంత్ వెల్లడిరచారు. గత ప్రభుత్వ నేత అలిగి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారంటూ విమర్శించారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని… సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విూ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. విూరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసాని 12 వేలకు పెంచి సహాయం అందిస్తున్నామని చెప్పారు. భూమి లేని రైతులకు కూడా సహాయం అందిస్తున్నామని తెలిపారు.. వరి వేసుకుంటే ఉరే అని ఆనాటి సీఎం అన్నారని.. కానీ నేడు వరి పంటకు బోనస్ ఇస్తున్నామన్నారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 5500 కోట్లు కేటాయించామని.. కోటి మంది మహిళలను కొటేశ్వరులు చేయాలన్నదే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వచ్చిన వారు మన ఆడబిడ్డలు చేసిన వస్తువులను చూశారన్నారు.. మహిళలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకుని సోనియమ్మ స్పూర్తితో ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న యువతకు గత పదేళ్లుగా ఉద్యోగాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందున్న అన్న వ్యక్తి ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం చర్యలు తీసుకుంటు-న్నామని.. విూ అందరూ అండగా ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.అలాగే సీఎం రేవంత్‌రెడ్డి జగ్గారెడ్డి గురించి మాట్లాడారు. జగ్గారెడ్డి భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తారు. వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పజెబుతున్నా. వారికి మంచి భోజనం పెట్టించి జగ్గారెడ్డి పట్టాలు ఇస్తారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేక సవిూక్ష చేసి నిధులు మంజూరు చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు…ఆ తర్వాత అభివృద్ధి మన అజెండా. సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్ నారాయణఖేడ్ కి రెండు కళ్ళలాంటి వారు. పటాన్ చెరు మినీ ఇండియా ప్రాంతం. ఇఐఊర, ఇఉర, కఒః, ఇక్రిశాట్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినవే.. సింగూరు నుంచి మంజీరా జలాలు హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
……………………………………………..
