* నేటి నుంచే కోడ్ అమలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచే కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఒక దశకు మరొక దశకు మధ్య రెండు, మూడురోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు. 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై స్టే విధించారని ఎస్ఈసీ కుముదిని పేర్కొన్నారు. ఈ నెల 27నుంచి తొలి దశల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. నవంబర్ 30 నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభిస్తామని.. మూడో దశ నామినేషన్ల ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీన ప్రారంభమవుతుందని కమిషనర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. ఉదయం 7 గంటట నుంచి.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందన్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలుంటాయన్నారు.

…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
