 
                * హైదరాబాద్ కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు
* ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఈవీ పాలసీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్ లో ఎదురయ్యే సవాళ్లు ,మౌలిక సదుపాయాల పై స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్ ,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి లతో కలిసి సెక్రటేరియట్ లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 9 నగరాల్లో 15 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో తెలంగాణ లో హైదరాబాద్ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. ఈ బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 6 వ తేదీ టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ లో రాష్ట్రానికి కావల్సిన మౌలిక సౌకర్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, టెక్నికల్ ఆపరేషన్స్ పై సమీక్షా సమావేశంలో చర్చించారు.
……………………………………….

 
                     
                     
                    