* అప్పుడు తెలియలేదా కేటీఆర్ కు
* పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హిల్ట్ పాలసీలో రెండు అంశాలు గత ప్రభుత్వంలోనివే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హిల్ట్ పాలసీపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మునిసిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ భూములు వేలం వేశారని అన్నారు. గత ప్రభుత్వంలో కోకాపేట నియోపోలిస్ ప్లాట్లను వేలం వేశారని తెలిపారు. ఓఆర్ ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారని గుర్తు చేశారు. దిల్సుఖ్ నగర్ సిరీస్ రాజ్ ఫ్యాక్టరీని, గత ప్రభుత్వం రెసిడెన్షియల్ జోన్‌గా కన్వర్జేషన్ చేసిందన్నారు. ఆరోజు మంత్రిగా కేటీఆర్ ఫైల్‌పై సంతకం చేశారని వెల్లడించారు. హిల్ట్ పాలసీ దోపిడీ అంటున్న కేటీఆర్ కు అప్పుడు అవన్నీ తెలియలేదా అని ప్రశ్నించారు. కాగా హిల్ట్ పాలసీ ఐదు లక్షల కోట్ల కుంభకోణమని, దానిపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి కేటీఆర్ నిన్న వెల్లడించారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా జీడిమెట్ల పారిశ్రామికవాడలో కేటీఆర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు పరిశ్రమలకు రాయతీపై విలువైన భూములు కేటాయించారని.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఇపుడు భారీగా పెరిగాయని తెలిపారు. జీడిమెట్ల ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో రూ.75 వేల కోట్ల వరకు విలువ చేసే భూములు ఉన్నాయని మాజీ మంత్రి అన్నారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ, హిల్ట్ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరపణలు గుప్పించారు. కోకాపేటలో వందల కోట్లు… జీడిమెట్ల ప్రాంతంలో కోటి రూపాయలు అంటే ఎలా అని ప్రశ్నించారు.
……………………………………………..
