
ఆకేరు న్యూస్, డెస్క్ : పోప్ ఫ్రాన్సిస్ (88) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఏడున్నరకు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. దీనిపై వీడియో ప్రకటనను వాటికన్ విడుదల చేసింది. వాటికన్ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషాద వార్తను ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్..(pope Francis) వాటికల్ సిటీలో కన్నుమూశారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొనడం విశేషం. ఆయన 88 సంవత్సరాల వయస్సులో మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు. ఆయన జీవితం విలువలతో నిండి ఉందని, విశ్వాసం, ధైర్యం, సార్వత్రిక ప్రేమకు పోప్ ప్రతీక అని ఫెర్రెల్ తెలిపారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనా(Argentina)లో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్.. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అంతకు ముందు అర్జెంటీనాలోని సొసైటీ ఆఫ్ జీసస్ యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా, బ్యూనస్ ఎయిర్స్ సహాయ బిషప్ గా, ఆకా బిషప్ గా, బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్ గా, అర్జెంటీనా ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు (2005–2011)గా కొనసాగారు.
……………………………….