* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమకు 8 వేల కోట్ల పెండింగ్ టోకెన్ల బకాయిలు చెల్లించాలంటూ నేటి నుంచి కళాశాలలకు బంద్‌నకు పిలుపునిచ్చాయి. కోట్ల బకాయిలు ఉన్నాయంటూ ఇంజినీరింగ్ సహా, ఇతర వృత్తివిద్యా కాలేజీలు బంద్‌కు పిలునిచ్చాయి. వెంటనే 12 వందల కోట్లు విడుదల చేయాలని కళాశాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు నడుపుతోంది. ఆదివారంతో చర్చలు జరిపిన ప్రభుత్వం నేడు కూడా చర్చలు కొనసాగించింది. సాయంత్రం మరోసారి ప్రొఫెషనల్ కాలేజీల (Professional Colleges) ప్రతినిధులతో మంత్రులు సమావేశం కానున్నారు. పెండింగ్ టోకెన్ల బకాయిలు మొత్తం రూ.12 వందల కోట్లు కళాశాలలకు తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే ఏ కళాశాలలకు ఎంతెంత టోకెన్లు, మిగిలిన బకాయిలు ఉన్నాయనే సమాచార సేకరణకు ఒక రోజు సమయం కావాలని ఆర్థిక శాఖ అధికారులు కళాశాలల యజమాన్యాలని కోరారు. ఈ నేపథ్యంలో టోకెన్లతోపాటు ఒక్కొక్క కళాశాలకు ఎంత ఫీజు బకాయిలు ఉన్నాయనే వాస్తవాలను, వాటిని ఎప్పుడెప్పుడు చెల్లించాలనే వివరాలను సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగే చర్చల సమావేశంలో అధికారులు వెల్లడిస్తారని ఫెడరేషన్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) వెల్లడించింది.
సానుకూలంగా చర్చలు : భట్టి
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarka) తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు.
………………………………………..
