
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో తెలంగాణ ఉద్యమకారులు శుక్రవారం రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు పంపారు. తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం స్థానిక బస్టాండ్ నుంచి పోస్టాఫీసు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోస్ట్ ఆఫీసు చేరుకుని రాహుల్ గాంధీ అడ్రెస్స్కి పోస్ట్ కార్డులు పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ఫోరం మండల అధ్యక్షుడు సంపత్ మాటాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ,వారి అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డ్, తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక పెన్షన్ ఏర్పాటు చేస్తారన్న హామీని త్వరితగతిన నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మారపెల్లీ నవీన్,మాజీ ఎంపీపీ రమేష్ , నకిర్త ఓదెలు, పుల్ల శోభన్, గాయకులు బెజ్జంకి సదాచారి, మోకిడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
……………………………….