
* వరంగల్ దుగ్గొండిలో ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని దుగ్గొండి గిర్నిబాయి ప్రభబండ్ల (prabhabandla) ప్రదర్శన వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొమ్మల జాతర సందర్భంగా ప్రభబండ్ల ప్రదర్శన వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ ఎస్(Brs), కాంగ్రెస్(Congress) శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి (Ex Mla Peddireddy Sudarsanreddy) ధర్నా చేశారు. హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతరకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే, జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శనతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రెండు దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అయితే గతంలో ఈ ప్రభ బండ్ల ప్రదర్శన సందర్భంగా హత్యల వరకు దారి తీయడంతో పోలీసులు కొంతకాలం నిషేధం విధించారు. ఆ తర్వాత మళ్లీ గత జాతర నుండి రాజకీయ పార్టీల సందడి మొదలైంది. ఈసారి ఎవరికి వారు తగ్గేదెలే అన్నట్లుగా పోటాపోటీగా ప్రభలతో తరలిరావడం ఉద్రిక్తతకు దారి తీసింది.. ఆధిపత్య ప్రదర్శనకు కొమ్మాల జాతర వేదికయింది.
……………………………..