 
                – నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం.
– హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్: మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ శుక్రవారం పర్యటించారు.కమలాపూర్, అంబాల,బత్తివానిపల్లి,ఉప్పల్, దేశారాజ్ పల్లె,కన్నూరు గ్రామాలలో పంట పొలాలను,రోడ్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఐకెపి సెంటర్లలో కొనుగోలు ప్రారంభించామని, ప్రభుత్వం రైతులపట్ల చిత్తశుద్దిగా ఉందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి,పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేసి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. వరి ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టేలా మిల్లర్లకు, సివిల్ సప్లై సంస్థకి ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు. దెబ్బతిన్న రోడ్లను బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని ప్రణవ్ అధికారులను కోరారు.
…………………………………………

 
                     
                     
                    