
* ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష.. మిగతావారికి జీవిత ఖైదు
* ఆరేళ్ల పాటు సాగిన విచారణ
ఆకేరు న్యూస్, నల్గొండ : కులాంతర వివాహం నేపథ్యంలో ఆరేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Nalgonda Sc, St Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈకేసులో ఏ2గా ఉన్న సుభాష్శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. తమపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని శిక్షాకాలం తగ్గించాలని కోరారు. ప్రణయ్ హత్య(Pranay Murder)తో తమకెలాంటి సంబంధంలేదని కొందరు కోర్టుకు తెలిపారు. అమృత బాబాయి శ్రవణ్ కుమార్ ఈమేరకు కోర్టుకు వెల్లడించారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని వేడుకున్నారు.
* 2018 జనవరిలో అమృత-ప్రణయ్ వివాహం
వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృత(Maruthirao Daughter Amrutha)ను 2018 జనవరిలో హైదరాబాద్లో ప్రణయ్ పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్, అమృత పెళ్లితో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాలూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాయి. ప్రణయ్ తోనే ఉంటానని పోలీసుల సమక్షంలోనే అమృత తెలిపారు.
* 2018 సెప్టెంబర్ 14న
2018 సెప్టెంబర్ 14న వైద్య పరీక్షల నిమిత్తం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి అమృత ఆస్పత్రికి వెళ్లారు. ఆసత్రి నుంచి తిరిగి వెళ్తుండగా మిర్యాలగూడలో ప్రణయ్ ను దుండగుడు కత్తితో నరికేశాడు. ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని మారుతీరావే ప్రణయ్ ను హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో మారుతీరావు సహా 8మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణయ్ హత్య(Pranay Murder) కేసుపై ఎస్టీ, ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది.
* 2019న జూన్ 12న
2019న జూన్ 12న 1600 పేజీల చార్జిషీటును పోలీసులు రూపొందించారు.
* 2020 మార్చిలో
2020 మార్చిలో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్ వాసి సుభాష్ శర్మ ఈకేసులో ఏ2గా ఉన్నాడు. ఏ3 అస్ఘర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 అబ్దుల్ ఖరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు శ్రావన్, ఏ7 డ్రైవర్ శివ. ప్రణయ్ హత్య కేసు విచారణ కోర్టులో దాదాపు ఆరేళ్ల విచారణ సాగింది.
* 2025 మార్చిలో
దాదాపు ఆరేళ్ల పాటు ప్రణయ్ హత్య కేసు విచారణ కొనసాగింది. 2025 మార్చి10న నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏ2కు ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ శిక్ష విధించింది.
………………………………..