ఆకేరున్యూస్, భువనేశ్వర్: విదేశీ భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది. భువనేశ్వర్లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. ఢల్లీిలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. మూడు వారాల జర్నీ ఉంటుందని.. దేశంలోని పలు సంప్రదాయ, మతపరమైన ప్రదేశాలను ఆ రైలు చుట్టివస్తుంది. ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ను.. ప్రత్యేక టూరిస్టు రైలును రూపొందించారు.
……………………………………