
* మరో ఏడాది పదవీకాలం పొడిగింపు
ఆకేరున్యూస్, ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చీఫ్గా ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మరో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీకాలం మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు డిఓపిటి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈనెల 25తో ప్రవీణ్ సూద్ రెండేళ్ల పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో ఆయన పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2023, మే 25న సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కాగా నూతన డైరెక్టర్ నియామకంపై సెలెక్ట్ కమిటీ- సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. నూతన సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కుడిన సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. తదుపరి డైరెక్టర్ కోసం పలువురు పేర్లతో డివోపిటి జాబితాను రూపొందించింది. ప్రతిపాదిత అధికారుల పేర్లపై సెలెక్ట్ కమిటీలో చర్చ జరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
……………………………………………..