* వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు
* కార్పొరేటర్లతో జీహెచ్ ఎంసీ అధికారుల సమావేశం
ఆకేరు న్యూస్, సికింద్రాబాద్: రానున్న వర్షాకాలంలో తీసుకోవల్సిన చర్యల గురించి జీహెచ్ ఎంసీ అధికారులు నగరంలోని కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ , డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారి ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు , రో డ్ల మరమ్మతులు,నాలల పరిశుభ్రత ,మ్యాన్ హోల్స్ , పారిశుధ్య నిర్వహణ, లోతట్టు ప్రాంతాల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పెండింగ్లోఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పరిధి లోని కార్పొరేటర్లు , Ghmc ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….
