
ఆకేరు న్యూస్ డెస్క్ : దీపావళి అంటేనే కాంతులతో కళకళలాడే పండుగ.. ఇంట్లో చిన్నా పెద్దా సంతోషాలతో జరుపుకునే పండుగ.ప్రతీ ఇళ్లు దీపావళి దివ్వెలతో వెలుగులు విరజిమ్మిస్తూ ఉంటుంది. ప్రతి వీథి లైట్ల మెరుపులతో ధగ ధగ లాడుతుంది. మొత్తం వాతావరణాన్ని వెలుగులతో నింపే ఈ పండగ ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కాంతులు నింపే ఈ పండగ తో మన జీవితాల్లో చీకట్లు కమ్మే అవకాశం ఉంది..
ఎందుకంటారా.. దీపావళి వేళ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఆ జాగ్రతలు ఏవంటే…
* బాంబులు కల్చేటప్పుడు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి
* పిల్లల దీపావళి సామగ్రిని కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి
* చేతితో నేరుగా బాంబులు కాల్చకూడదు. చేతిలో పేలే అవకాశం ఉంటుంది.
* ఎలాంటి మంటలు వ్యాపించినా చల్లార్చడానికి నీళ్లు సిద్ధంగా ఉంచుకోవాలి
*నిప్పు రవ్వలు ఒంటిపైని దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా కాటన్ దుస్తులనే ధరించడం మంచిది.
* ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్ నెంబరు గుర్తుపెట్టుకోండి.
* నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెట్టాల్ తదితరాలతో కూడిన ఫస్ట ఎయిడ్ కిట్ సిద్ధం చేసుకోవాలి.
* పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది.
* విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది.
* పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు.
* అలాగే భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు.
* మీ దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచవద్దు.
* వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్ళి పరిశీలించడం, మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం.
* వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా చర్యలు తీసుకోండి.
* ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేయాలి
* పెద్ద పెద్ద టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు.
…………………………………………………….