ఆకేరు న్యూస్ డెస్క్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ (Chairperson of Public Service Commission) గా ప్రీతిసుదన్ (Preethisudan) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ (UPSC) కమిషన్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శిగా పని చేశారు. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రీతిసుదన్ 2020 జూలైలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి (Union Health Secretary) గా రిటైర్ అయ్యారు. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబూషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శి (Secretary, Food and Public Distribution Department) గా, మహిళా, శిశు అభివృద్ధి, రక్షణ శాఖల్లో కార్యదర్శి (Women, Child D.evelopment and Defense Departments) గా చేశారు. ఆర్థికశాస్త్రంలో ఆమె ఎంఫిల్ (MPhil in Economics) చేశారు. సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఎంఎస్సీ (MSc in Social Policy and Planning) చదివారు. రెండు కీలకమైన కేంద్ర పథకాలను ఆమె రూపకల్పన చేశారు. బేటీ బచావో, బేటీ పడావోతో పాటు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ (Ayushman Bharat Scheme along with Beti Bachao, Beti Padao) లకు తుదిరూపు ఇచ్చింది ఈమే. నేషనల్ మెడికల్ కమీషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కమీషన్ (National Medical Commission, Allied Health Professionals Commission), ఈ-సిగరెట్ల నిషేధంపై చట్టాలను రూపొందించారు. వరల్డ్ బ్యాంకు వద్ద కన్సల్టెంట్ (Consultant at World Bank) గా చేసినట్లు యూపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నది. 2022 నుంచి కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఆమె ఆగస్టులో చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.
———————–