
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. సీడీఎస్ అనిల్ చౌహాన్తో కలిసి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ గురించి రాష్ట్రపతికి వివరించారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా రాష్ట్రపతి అభివర్ణించారు. ఈ మేరకు సాయుధ దళాల తెగింపు, అంకిత భావాన్ని ప్రశంసించారు.
………………………………………