ఆకేరు న్యూస్, డెస్క్ : పుట్టపర్తిలోని సత్యసాయి శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొన్నారు. రాష్ట్రపతి ముర్ముకు సీఎం చంద్రబాబు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో చేరుకొని సత్యసాయి బాబా శతజయంతోత్సవంలో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో పుట్టపర్తిలో నిఘా ను కట్టుదిట్టం చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
