
* ఆయనను కలవడంలో రాజకీయం ఏముంది?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రధాని మోదీ (Modi) రాష్ట్రాల సీఎంలకు పెద్దన్నలాంటి వారేనని అని సీఎం రేవంత్ (Revanth) అన్నారు. తాను ప్రధానిని కలవడంలో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశానన్నారు. ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది అని చెప్పారు. ఢిల్లీ (Delhi) పర్యటనల పేరుతో దుబారా చేయట్లేదని అసెంబ్లీలో సీఎం రేవంత్ వివరించారు. రాజకీయాలకు వచ్చినప్పుడు తాను కాంగ్రెస్ నేతనని, ఆయన బీజేపీ నాయకుడు అన్నారు. అవసరమైతే మహేశ్వర్ రెడ్డి(Maheswarreddy) ని తీసుకుని ఢిల్లీకి వెళ్తామన్నారు. కిషన్ రెడ్డి(Kishanreddy)ని నాలుగు సార్లు కలిశామని వెల్లడించారు. నిర్మలా సీతారామన్, అమిత్ షాను కూడా కలిసినట్లు చెప్పారు.
……………………………………..