* సీఎం ప్రజావాణి దరఖాస్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టండి
* కలెక్టర్ హరిచందన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన దాసరి (Collector Harichandana Dasari) అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే సీఎం ప్రజావాణి (Cm Prajavani) దరఖాస్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపారు. దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టరేట్(Collectarate)లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల కోసం 99 మంది, పింఛన్లు కావాలని 31 మంది, రెవెన్యూకు 16, ఇతర శాఖలకు 21 మంది దరఖాస్తులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముకుందరెడ్డి, కదివరన్ పళని, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, సీపీఓ సురేందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.
…………………………………………………..
