
* గాంధీ ఆస్పత్రిలో ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినీ పక్కీలో ఓ ఖైదీ పరారైన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ ఖైదీ తప్పించుకొని పోయిన సంఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేట దోపిడీ కేసులో పోలీసులు సోహెల్‌ను అరెస్టు చేశారు. చర్లపల్లికి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షల కోసం ఖైదీ సోహెల్‌ను గాంధీ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు. బాత్రూం వస్తుందని పోలీసులకు చెప్పి బాత్రూంలోకి ప్రవేశించాడు. బాత్రూంలో కిటికిని తొలగించి అందులో నుంచి దూకి పరారయ్యాడు. బాత్రూం నుంచి సోహెల్ ఎంతకూ రాకపోయేసరికి పోలీసులు బాత్రూం తలుపులు తెరిచి చూసి ఖంగుతిన్నారు. కాగా, చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………