ఆకేరున్యూస్, హైదరాబాద్: నవంబర్ 3 నుండి ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేటు కాలేజీల సమాఖ్య స్పస్టం చేసింది. దీనిలో భాగంగానే అక్టోబర్ 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని తెలిపింది. అక్టోబర్ 25న సమాఖ్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి, విద్యార్థి సంఘాలతో చర్చిస్తామని.. అంతేకాకుండా అక్టోబర్ 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని, నవంబర్ 1 నాటికి అన్ని పార్టీల నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించింది.
గతంలోనే ప్రకటన..
పెండిరగ్ బకాయిలను చెల్లించకపోతే సెప్టెంబర్ 15 నుండి కాలేజీలు బంద్ చేస్తామని గతంలో ప్రైవేటు కాలేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే… అయితే ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో గతంలో రెండు రోజులు కాలేజీలు మూతపడ్డాయి. తరువాత విడతల వారిగా ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బంద్ విరమించాయి. సెప్టెంబర్ నెలలో రూ.600 కోట్ల బకాయిలు చెల్లిస్తామని, మొదట రూ.600 కోట్లు చెల్లించి మిగితావి దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని పేర్కొంది. దీపావళి వచ్చినా నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నవంబర్ 3 నుండి బంద్కు పిలుపునిస్తున్నాయి. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వృత్తి విద్యాకోర్సులు బోధిస్తున్న కాలేజీలు సైతం బంద్ కానున్నాయి.
……………………………………….
