* శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడి సస్పెన్షన్
ఆకేరున్యూస్, శ్రీకాళహస్తి: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడిరది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతిపూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న గురువారం హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే ఓ అర్చకుడు పూజలు నిర్వహించడంతో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు బయట ఎక్కడా కూడా ఇలాంటి పూజలు చేయకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. ఏ ఆలయంలో అయినా కూడా ఆ ఆలయానికే పనిచేయాలని.. అలా కాకుండా ప్రైవేటుగా ఇలాంటి పూజలు చేసినప్పుడు సదరు అర్చకులపై దేవాదాయ శాఖ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఫ్యామిలీకి శ్రీకాళహస్తి అర్చకుడు ప్రత్యేకంగా పూజలు చేసిన అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడం దేవస్థానం ఈవో బాపిరెడ్డి వెంటనే స్పందించారు.ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడికి మెమో ఇచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించినందుకు ఆలయంలో విధులు నిర్వహించిన వేద పండితులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు అర్చకుడిని ఈవో బాపిరెడ్డి విధుల నుంచి తొలగించారు. అలాగే గతంలో కూడా చాలా మంది ఇలా ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వల్ల అలాంటి వ్యవహారంలో మిగిలిన వారు భయంతో ఉండే అవకాశం ఉంటుందని ఈవో బాపిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
