
ఆకేరున్యూస్, వరంగల్: కేయులో మార్చి21, 22న జరిగే జాతీయ సెమినార్కు ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ జి.హరగోపాల్ హజరవుతున్నట్లు కె.యు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగంలో ఆధ్వర్యంలో మార్చి 21, 22 తేదీలలో ‘‘భారతీయ సమాజంలో సంకీర్ణ రాజకీయాలు మరియు సామాజిక పరిస్థితి’’అనే అంశంపై జరిగే జాతీయ సెమినార్ ప్రారంభ సమావేశానికి ముఖ్య ఉపన్యాసకులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ రాజనీతి శాస్త్ర విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ ని ఆహ్వానించినట్లు కె.యు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్ తెలిపారు.గురువారం హైదరాబాదులో ప్రొఫెసర్ జి.హరగోపాల్ వద్దకు వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రొఫెసర్ జి.హర గోపాల్ తప్పకుండా జాతీయ సెమినార్ కు హాజరవుతానని మాట ఇచ్చారన్నారు.ఈకార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ ,డాక్టర్ వాడపల్లి నాగరాజు, రీసెర్చ్ స్కాలర్స్ అంకెళ్ల శంకర్ , కలిపికొండ వినోద్ తదితరులు ఉన్నారు.
…………………………………………