* వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ: హనుమకొండ హంటర్ రోడ్డు జూ పార్క్ సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్ లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డు జూపార్కు సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. రీజినల్ సైన్స్ సెంటర్ లోని ఎస్సీ,ఎస్టీ సెల్ భవనంతో పాటు ఆడిటోరియం, ఇన్నోవేషన్ హబ్, ల్యాబ్, ప్రదర్శన యంత్రాలు, సైన్స్ పరికరాలకు సంబంధించిన భవనాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
సంబంధిత ల్యాబ్ లు, ప్రస్తుతం ఉన్న వనరులు, ఇంకా సైన్స్ సెంటర్ కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి, కుడా ఆధ్వర్యంలో మరమ్మతు పనుల కోసం రూ. నాలుగు కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే, కలెక్టర్కు రీజినల్ సైన్స్ సెంటర్ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏకైక రీజినల్ సైన్స్ సెంటర్ ఇది అని, సైన్స్ సెంటర్ లో భవనాల మరమ్మతు తోపాటు ఆధునిక సైన్స్ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి మెంబర్ సెక్రెటరీ డాక్టర్ సుంకె రాజేంద్రప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ మారుపాక నగేష్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, ప్రాజెక్టు ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, సాంబశివరెడ్డి, రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈర్ల రాకేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నితీష్ రెడ్డి, కుడా ఈ ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
……………………………