ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి బొమ్మకి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మక్కల గురించి అసెంబ్లీలో మాట్లాడిన కడియం శ్రీహరి మహిళలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానన్న రూ. 2500 గురించి ఎందుకు అడగలేదు అన్నారు. తులం బంగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదు, రైతు భరోసా గురించి ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మల్కాపూర్ గ్రామాన్ని మండలం చేస్తానన్న కడియం శ్రీహరి మండలాన్ని మరిచిపోయాడా ? అన్నారు. బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన కడియం శ్రీహరి, నేటికీ టిఆర్ఎస్ పార్టీ ద్వారానే జీతం తీసుకుంటున్నాడు. కనుక బిఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో పై వాటిని గురించి ఎందుకు రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదని మహిళలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రశ్నించారు. కార్యక్రమంలో జనగామ యాదగిరి, కేశవరెడ్డి రాకేష్ రెడ్డి, రంగు హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
